నిత్యము స్తుతులను పాడెదనూ యేసయ్యా (వరములతో)
nityamu stutulanu paadedanoo yeesayyaa (varamulatoo)
నిత్యము స్తుతులను పాడెదనూ యేసయ్యా స్తోత్రమని నిను పొగడెదనూ యేసయ్యా (2) ఘనుడవని ఆరాధించెదను ప్రముఖుడవని సేవించెదను (2)
వరములతో నీ వశమై - మనసారా కొలిచెదను ఫలములతో మైమరచి - హృదయముతో పూజించెదను (2) ||నిత్యము స్తుతులను ||
రకరకాల వలయాలెన్నో ఆవరించగా నీ ముందర నిలిచే ధైర్యం క్షీణించిపోయెను (2) ప్రమాదపు అంచున నిలిచినానని వెనుకకు పిలిచావు నాకై దాచిన నీ సంకల్పం స్థిరమని తెలిపావు (2) || వరములతో ||
2.నా దృష్టికి అందని జ్ఞానము అజ్ఞానిని చేయగా పలు శోధన మార్గములెన్నో బలహీనుని చేసెను (2) అయినను ఓ మంచి పాత్రగా నీతో నడిపావు కృపను వెంబడి కృపను పంపి సంపూర్ణుని చేశావు (2) || వరములతో ||
ప్రతి అక్కరలో మనుష్యులను ఆశ్రయించగా నీ బలమంతటిని బహుగా చులకన చేసాను (2) కోపము చూపక మరోమారు నీ ఋణమును పెంచావు విలువలేని ఈ అధమునిపై నీ ప్రేమను చాటావు (2) || నిత్యము ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
