నూతనమైనది నీ వాత్సల్యము ప్రతి దినము నన్ను దర్శించెను
Noothanamainadi Nee Vaathsalyamu Prathi Dinamu Nannu Darshinchenu
నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను – దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావు జరగబోయే కాలమంతా – నీ కృపలోన – నన్ను దాచెదవు (2) విడువని దేవుడవు – ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను||
నా హీన దశలో – నీ ప్రేమ చూపి – పైకి లేపినావు ఉన్నత స్థలములో – నను నిలువబెట్టి – ధైర్యపరచినావు (2) మరువని దేవుడవు – నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను||
నీ రెక్కల క్రింద – నను దాచినావు – ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా – నీవుండినావు – సంరక్షించావు (2) ప్రేమించే దేవుడవు – తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||