నుతి సేయను లేవే యో మనసా నుతిఁజేయను లేవే క్షితిని దివిని హితమతిఁ బ్రోచెడి సుతుని జనకుని శుద్ధాత్మునిఁ ద్ర్యేకుని ||నుతి సేయను||
సూర్యుని కాంతి సొంపగు పంటలు సుకాలక్షేమముల్ శోభిలు గేహమున్ ఆర్య సాంగత్యము నైశ్వర్యముల నిల ననుభవింపవె నీవా యాఢ్యుని పేర్మిని ||నుతి సేయను||
దురితము లందె దుర్గతి నున్న నీ కురుతర ప్రేమను బరమార్థ మీయను వరపుత్రు నొసఁగఁడె వందనీయుఁడు ప్రభు మరిమరి మ్రొక్కు మా పరమోపకారిని ||నుతి సేయను||
జీవము జ్ఞానము జీవము నొసంగెడు పావనాత్మను నీకై పంపిన దేవుడు కేవల దోష స్వ భావము మార్చఁడె సేవ జేయుమ నీవా పావనమూర్తికి ||నుతి సేయను||
కరములు పదముల్ కనకాదు లన్నియు స్వరమును చిత్తము స్థిరమగు ప్రేమయు మరి నీదు హృదయము పరమాత్ము సేవకై పరిపూర్ణముగ నిచ్చి ప్రణుతించు మాయనన్ ||నుతి సేయను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.