♪♫
TG-5326
Telugu
నువ్వే కావాలయ్యా నీ ప్రేమ చాలయ్య
Nuvvee Kaavaalayyaa Nee Preema Chaalayya
0
views
పల్లవి
నువ్వే కావాలయ్యా - నీ ప్రేమ చాలయ్య నీతో ఉండాలయ్యా - నీకై బ్రతకాలయ్యా నువ్వే కావాలయ్యా - యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా - యేసయ్యా నీతో ఉండాలయ్యా - యేసయ్యా - నీకై బ్రతకాలయ్యా - యేసయ్యా యేసయ్యా నా బలమా (2) ||నువ్వే||
1వ చరణం
1. లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవు మనుష్యులలో మంచితనము కంటె - మహనీయుడవు(2) ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయా నీవు ఉండగా లోకం నాకు ఎందుకు మెస్సయ్యా (2) ||నువ్వే||
2వ చరణం
2. ప్రకృతిలో అందచందాల కంటే - సుందరుడవు లోకంలో ధనధాన్యాలకంటే - ధనవంతుడవు (2) ఈ లోకంలో నీవు గాక నాకెవరున్నారయా నీవు ఉండగా ధన ధాన్యాలు ఎందుకె మెస్సయ్యా (2) ||నువ్వే||