♪♫
TG-5324
Telugu
నువ్వు లేని నన్ను ఊహించలేను
Nuvvu Leeni Nannu Oohinchaleenu
19
views
పల్లవి
నువ్వు లేని నన్ను ఊహించలేను నీ ఉన్నత ప్రేమను వివరించలేను (2) అడగాలని నేను అనుకోకముందే నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు (2) నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు యేసయ్యా నీవే నా ఆరాధ్య దైవమా యేసయ్యా నీవే నా ఆధార దీపమా (2) ||నువ్వు లేని||
1వ చరణం
పదివేలలో అతి సుందరుడా కురూపినైన నాకు నీ స్వారూప్యమునిచ్చావు ఎందుకు పనికిరాని వాడనై యుండగా నీ కుమారునిగా నను స్వీకరించావు (2) ||అడగాలని||
2వ చరణం
ఏ పాపమును ఎరుగని పరిశుద్ధుడా ఘోరపాపినైన నాకు పరిశుద్ధత నొసగావు ఈ లోకము వీడి నిన్ను చేరేంత వరకు పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచావు (2) ||అడగాలని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.