ఓ క్రీస్తు సంఘమా
O Kreesthu Sanghamaa
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా ప్రభువు నామములో సాగే అనుబంధమా ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా ఓ కంట కన్నీరు తగదు సహవాసమా ప్రతి కష్టము మనము పంచుకుందాము కలిసి అందరము వేడుకుందాము (2) ||ఓ క్రీస్తు||
మనమంతా కలిసి ఆ దేవుని దేహము తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2) ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2) ||ప్రతి కష్టము||
సాటి సోదరులు శ్రమల పాలైనపుడు సాతాను శక్తులచే శోధింపబడినపుడు (2) ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2) ||ప్రతి కష్టము||
శ్రమలు పొందేవారు అవిధేయులు కారు విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2) శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2) ||ప్రతి కష్టము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.