♪♫
TG-4028
Telugu
ఓ మానవా
O Maanavaa
0
views
పల్లవి
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా ఓ మానవా.. ఇకనైనా మారవా మన పాపములను క్షమియించుటకే సిలువ మరణము పొందెనని (2) గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2) ఈ దినమే అనుకూలం… లేదిక వేరే ఏ సమయం (2) నిజమేదో తెలియకనే చనిపోతే నీ గతి ఏమి? (2) ||ఓ మానవా||
1వ చరణం
సిలువను గూర్చిన శుభ వార్త వెర్రితనముగా ఉన్నదా? దేవుని శక్తని తెలుసుకొని ప్రభు మార్గమును చేరెదవా (2) ||ఈ దినమే||
2వ చరణం
ప్రయాసముతో భారము మోసే నిన్నే దేవుడు పిలిచెనుగా ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద వేగిరమే పరుగిడి రావా (2) ||ఈ దినమే||
3వ చరణం
నీ ధనము నీ ఘనము నీ సర్వస్వము చితి వరకే అర్పించుము నీ హృదయమును (నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2) ||ఈ దినమే||