ఒక క్షణమైనా నిన్ను వీడలేక
oka kshanamainaa ninnu veedaleeka
ఒక క్షణమైనా నిన్ను వీడలేక - మన లేను ఇలలో నా ప్రభువా మాకోసమే ఈ త్యాగము చేసావయ్యా బహు ప్రేమతో మా యేసయ్య శతకోటి స్తోత్రమయ్యా ఒక క్షణమైనా నిన్ను వీడలేక
పరలోక మహిమను మా కోసము నీవు విడిచి వచ్చావయ్యా దాసుని స్వరూపము మా కోసము ప్రియముగా ధరించితివి (2) సురూపమైనను సొగసైనను లేకుండా మారితివి మాకై నలుగొట్ట బడితివి (2) ఒక క్షణమైనా నిన్ను వీడలేక - మన లేను ఇలలో నా ప్రభువా
అరికాలు మొదలు శిరస్సు అంతయు నిలువెల్ల గాయములే నిందలు హేళనలు పిడుగుద్దులు మౌనముగా భరించితివి (2) కరుకైన ఆశిలువ ఆ కొయ్య పై మా కొరకై వ్రేలాడితివి నీ రక్తాన్నంతా కార్చితివి (2) ఒక క్షణమైనా నిన్ను వీడలేక - మన లేను ఇలలో నా ప్రభువా
దయనీయమైన మా బ్రతుకులు చూచి కన్నతండ్రి అల్లాడితివి కనికరము చూపే నీ కన్నుల నుండి కన్నీరు కార్చితివి (2) దినమెల్ల నీ చేతులు మా కోసము దీనుడవై చాపితివి కరుణతో పిలుచుచుంటివి (2) ||ఒక క్షణమైనా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
