♪♫
TG-2300
Telugu
ఒక క్షణమైనా నిన్ను వీడి
oka kssannamainaa ninnu veedi
84
views
పల్లవి
ఒక క్షణమైనా నిన్ను వీడి ఉండలేనయ్య నా యేసయ్యా (2) యేసయ్యా యేసయ్యా (2) ||ఒక||
1వ చరణం
నశియించిపోతున్న నన్ను బ్రతికించినావయ్యా యేసు కృశించిపోతున్న నాలో వేంచేసినావయ్యా యేసు నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా ||యేసయ్యా||
2వ చరణం
మతిలేక తిరిగిన నన్ను నీ దరి చేర్చినావయ్యా యేసు శ్రమ చేత నలిగిన నాకు వరమిచ్చినావయ్యా యేసు నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.