♪♫
TG-4041
Telugu
ఒకని తల్లి
Okani Thalli
19
views
పల్లవి
ఒకని తల్లి ఆదరించునట్లు నను ఆదరించిన నా దేవుడు (2) హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా (2) ||ఒకని||
1వ చరణం
ఒకసారి నేను నీ మందనుండి నే తప్పిపోయిన వేళ (2) నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2) నీ చంకపెట్టితివా యేసయ్యా (2) ||ఒకని||
2వ చరణం
నీ సన్నిధినుండి నే దూరమవగా చిక్కాను దొంగ చేతిలోన (2) నను దోచిపోగా నను దాటిపోగా (2) బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2) ||ఒకని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.