ఒకసారి నీ స్వరము వినగానే
okasaari nee svaramu vinagaanee
🎵 TG-2874🌐 Telugu
పల్లవి
ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది (2) నా ప్రతి శ్వాసలో నువ్వే ప్రతి ధ్యాసలో నువ్వే ప్రతి మాటలో నువ్వే నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||
1వ చరణం
నీ సిలువ నుండి కురిసింది ప్రేమ ఏ ప్రేమ అయినా సరితూగునా నీ దివ్య రూపం మెరిసింది ఇలలో తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి||
2వ చరణం
ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా బ్రతికించు మమ్ములను నీ కోసమే తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం నడిపించు మమ్ములను నీ బాటలో