ఒకే ఒక్క కోరిక మన్నించు యేసయ్య
okee okka koorika manninchu yeesayya
ఒకే ఒక్క కోరిక మన్నించు యేసయ్య అడిగి అడిగి నేను అలసిపోతినయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా త్రోసివేయకు ఎన్నేండ్ల నుంచో నేను ఎదురుచూచితి (2) ఈసారి అయినా మాపై జాలి చూపవా ఈసారి అయినా మాపై కరుణ చూపవా ||ఒకే ఒక్క కోరిక||
విరోధుల చేతిలో నలిగిపోతిమి శ్రమలనే కొలిమిలో కాల్చబడితిని (2) భరించుటకు నేను వెండిని కాదయ్యా ఓర్చుకొనుటకు నేను మట్టి నేనయ్యా (2) ఇక చాలయ్య కొలిమిలో నుండి పైకి లాగవా ఇక చాలయ్య శ్రమ అనే కొలిమిలో నుండి పైకి లాగవా ||ఒకే ఒక్క కోరిక||
కన్నీరు విడుచుచు విత్తుచుండగా సంతోష గానముతో పంటకోసేదా (2) నీ కొరకై సిద్ధము చేసిన ఫలము కోసమే ఉపవాస ప్రార్థనలో కనిపెట్టేదా (2) ఇక చాలయ్య కన్నీటి లోయ నుండి పైకి లాగవా (2) ||ఒకే ఒక్క కోరిక||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
