ఒక్క మాట చాలు యేసయ్య
okka maata chaalu yeesayya
ఒక్కమాట చాలు యేసయ్య నీదు ఒక్కమాట చాలు యేసయ్య (2) విడుదలను, స్వస్థతను ఇచ్చే ఒక్కమాట చాలు సంవృద్ధి,జీవమును ఇచ్చే ఒక్కమాట చాలు (2)
నా జీవితమును మార్చే ఒక్కమాట చాలు నా బ్రతుకులో వెలుగును నింపే ఒక్కమాట చాలు (2)
ఒక్కమాటతో నీవు సూన్యమునే సృష్టిగా చేసి - రూపమునిచ్చిన దేవుడవు ఒక్కమాటతో నీవు సూర్యచంద్రులనే అపి - కదలకుండా నిలిపిన దేవుడవు (2) సూన్యమునే సృష్టిగా చేసిన -ఒక్క మాట చాలు సూర్య చంద్రులనే ఆపిన- ఒక్కమాట చాలు (2) ||నా జీవితమును||
ఒక్కమాటతో నీవు సంద్రమునే పాయాలుచేసి - నేల నడిపించిన దేవుడవు ఒక్కమాట తో నీవు ఫరో సైన్యమునే - నీటముంచివేసిన దేవుడవు (2) సంద్రమునే పాయలు చేసిన - ఒక్కమాట చాలు సైన్యమునే నీటముంచిన -ఒక్కమాట చాలు (2) ||నా జీవితమును||
3)ఒక్కమాటతో నీవు హన్నా కన్నీటిని తుడచి - నిందను మాపిన దేవుడవు ఒక్కమాటతో నీవు గాలి తుఫాను - గద్దంచి అణచిన దేవుడవు (2) కన్నీటి తుడచివేసిన- ఒక్కమాట చాలు గాలీతుఫానును అణచిన -ఒక్కమాట చాలు (2) ||నా జీవితమును||
ఒకే ఒక్కమాట చాలు ఒక్కమాట చాలయ్య అద్భుతమును జరిగే మాట - ఒక్కమాట చాలయ్య ఒకే ఒక్కమాట చాలు ఒక్కమాట చాలయ్య విడుదలను ఇచ్చే మాట- ఒక్కమాట చాలయ్య ఒకే ఒక్కమాట చాలు ఒక్కమాట చాలయ్య స్వస్థతను ఇచ్చే మాట- ఒక్కమాట చాలయ్యా ఒకే ఒక్కమాట చాలు ఒక్కమాట చాలయ్య చీకటిని వెలుగుగా మార్చే - ఒక్కమాట చాలయ్య ఒకే ఒక్కమాట చాలు ఒక్కమాట చాలయ్య జీవమును ఇచ్చే మాట - ఒక్కమాట చాలయ్య ఒక్కమాట చాలు యేసయ్య - నీదు ఒక్కమాట చాలు యేసయ్య (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
