ఒక్కడే యేసు ఒక్కడే
Okkade Yesu Okkade
ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే (2) మహాదేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||
పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే (2) జీవమార్గమై సత్యదైవమై మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||
అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే (2) ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||
నిత్యమూ ప్రేమించువాడు యేసు ఒక్కడే నిత్యా శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే (2) నీ వేదనలో నీ బాధలలో నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||
మరణము గెలిచినవాడు యేసు ఒక్కడే మరల రానున్నవాడు యేసు ఒక్కడే (2) పరిశుద్దులను ఆ పరమునకు కొనిపోవువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.