ఒక్కడే యేసు ఒక్కడే - ఒక్కడే పరిశుద్ధుడు
okkadee yeesu okkadee - okkadee parishuddhudu
ఒక్కడే యేసు ఒక్కడే - ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే మహా దేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే
పాపిని విడిపించువాడు - యేసు ఒక్కడే పాపిని ప్రేమించువాడు - యేసు ఒక్కడే జీవ మార్గమై - సత్య దైవమై మోక్షానికి చేర్చువాడు యేసు ||ఒక్కడే యేసు||
అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే ||ఒక్కడే యేసు||
నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే నిత్య శాంతి నిచ్చువాడు యేసు ఒక్కడే నా వేదనలో నా బాధలలో నా అండగా నిలుచువాడు యేసు ఒక్కడే ||ఒక్కడే యేసు||
మరణము గెలచినవాడు యేసు ఒక్కడే మరల రానున్న వాడు యేసు ఒక్కడే పరిశుద్ధులను ఆ పరమునకు కొనిపోవువాడు యేసు ఒక్కడే ||ఒక్కడే యేసు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.