TG-4045
Telugu

Oneness Season 2 దావీదు వలె నాట్యమాడి

Oneness Season 2

25
views
పల్లవి

దావీదు వలె నాట్యమాడి తండ్రీని స్తుతించెదను (2) యేసయ్యా స్తోత్రముల్‌ (4) తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2) యేసయ్యా స్తోత్రముల్‌ (4) దేవునియందు నిరీక్షణ యుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా (2) నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే (2) ఆధారము ఆదరణ ఆయనలో (2) నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప (2) నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నా నావా యేసే నా పరి హారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి (2) ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే భాదలెన్నో (2) ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము (2) హల్లెలూయ హొసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2) సాతాను పై అధికార మిచ్చును శక్తి గల యేసు నామము (2) శత్రు సమూహము పై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము (2) పరమ జీవము నాకు నివ్వండి తిరిగి లేచెను నాతో నుండ (2) నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును (2) యేసు చాలును యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెను (2) లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను (2) నాదాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా (2) నా కేడెము కోట నీవే (2) నా రక్షణ దుర్గమా నాదాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్యము గల రాజు భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రాజాధి రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను (2) మనయేసు రాజు వచ్చును పరిశుద్ధులన్‌ చేయ మనలన్‌ (2) ఆహా.. మన మచట కేగుదాం (2) నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ (2) యేసే నా మంచి కాపరి యేసే నా గొప్ప కాపరి యేసే నా ప్రధాన కాపరి యేసే నా ఆత్మ కాపరి యేసే నన్ను కొన్న కాపరి యేసే నాలో ఉన్న కాపరి (2) యెహోవా నా కాపరి నాకు లేమిలేదు పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్ (2) నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది (2) నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును (2) హల్లెలూయా యేసునాథా కృతజ్ఞతా స్తుతులు నీకే (2) నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నాకభయమిచ్చితివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞతా స్తుతులు నీకే (2) మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది (2) మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2) నా జీవిత ధన్యతై యున్నది (2) నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2) యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2) పరమును చేరగ నే వెళ్లెద (2) హనోకు వలె సాగెదా నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును (2) మహిమాన్వితుడై ప్రభుయేసు మహీస్థలమునకు ఏతెంచును (2) యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు అందుకొందువని స్తుతి చేయుచున్నాము దేవా నీవే  స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే మహిమ రూపివి దేవా నీవే  స్తోత్ర పాత్రుడవు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు (2) ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ (2) ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ (2) మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు (2) స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకె ప్రభూ (2) ఆరాధన  ఆరాధన  ఆరాధన ఆరాధన నా యేసు ప్ర్రభునికే ప్రియ యేసు ప్రభునికే ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధన ఆరాధన (2) నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.