ఒంటరి నే కానయ్యా - యేసయ్యా
ontari nee kaanayyaa - yeesayyaa
ఒంటరి నే కానయ్యా - యేసయ్యా ఒంటరి నే కానయ్యా (2) నీ దయ వుండగా - కృప తోడై నడువగా దయ వుండగా-కృప తోడై నడువగా
హల్లెలూయా - స్తోత్రమూ యేసయ్యా - నీ నామమే అభయమూ ||ఒంటరి||
చీకటి నన్నూ తరిమిననూ కష్టాలు అలలై ముంచిననూ (2) భయపడదూ - నా హృదయం (2) నీ బలమైన హస్తమే - ఆయుధమవగా (2) ||హల్లెలూయా||
ఓటమిలా కనిపించిననూ మాటలు అగ్నియై కాల్చిననూ (2) వెనుకకు పడదూ నా అడుగూ (2) మార్గము నీవై పయనం సాగూ (2) ||హల్లెలూయా||
ఆగని పరుగులా సాగిననూ ఆపద గాలులై వీచిననూ (2) పడిపోలేదూ - నా జీవితం (2) క్రీస్తే పునాదియై- మందిరమవగా (2) ||హల్లెలూయా||
ఎవ్వరు లేరని అనలేనుగా మహిమ మేఘమే – తోడవగా (2) మెల్లనీ - నీ స్వరమూ (2) నా ధైర్యమై - సాక్షిగా వెడలుచుండగా (2) ||హల్లెలూయా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
