TG-4047
Telugu

ఒంటరివి కావు ఏనాడ

Ontarivi Kaavu Aenaadu

0
views
పల్లవి

ఒంటరివి కావు ఏనాడు నీవు నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2) ఆలకించవా ఆలోచించావా ఆనందించవా (2) ||ఒంటరివి||

1వ చరణం

వెలివేసారని చింతపడకుమా ఎవరూ లేరని కృంగిపోకుమా ఒంటరితనమున మదనపడకుమా మంచి దేవుడు తోడుండగా (2) ఆత్మహత్యలు వలదు ఆత్మ ఆహుతి వలదు (2) ||ఆలకించవా||

2వ చరణం

బలము లేదని భంగపడకుమా బలహీనుడనని బాధపడకుమా ఓటమి చూచి వ్యసనపడకుమా బలమైన దేవుడు తోడుండగా (2) నిరాశ నిస్పృహ వద్దు సాగిపోవుటే ముద్దు (2) ||ఆలకించవా||