♪♫
TG-2374
Telugu
ఒంటరివి కావు ఏనాడు నీవు
ontarivi kaavu eenaadu neevu
69
views
పల్లవి
ఒంటరివి కావు ఏనాడు నీవు నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2) ఆలకించవా ఆలోచించావా ఆనందించవా (2) ||ఒంటరివి||
1వ చరణం
వెలివేసారని చింతపడకుమా ఎవరూ లేరని కృంగిపోకుమా ఒంటరితనమున మదనపడకుమా మంచి దేవుడు తోడుండగా ఆత్మహత్యలు వలదు ఆత్మ ఆహుతి వలదు (2) ||ఆలకించవా||
2వ చరణం
బలము లేదని భంగపడకుమా బలహీనుడనని బాధపడకుమా ఓటమి చూచి వ్యసనపడకుమా బలమైన దేవుడు తోడుండగా నిరాశ నిస్పృహ వద్దు సాగిపోవుటే ముద్దు (2) ||ఆలకించవా||