ఓ దేవ నేను నీ

oo deeva neenu nee

🎵 TG-411💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఓ దేవ నేను నీ దాపున నుండెదన్ నీ దాపున నుండెదన్ నా దేవ నను లేపు నవి సిల్వ శ్రమలైనన్ నీ దాపున నుండు నీ సేవకుని పాట ||ఓ దేవ||

1వ చరణం

బాటసారి లాగు నేఁడు భానుఁడు గ్రుంకి మేటి చీఁకటి గ్రమ్మినన్ నేటి విశ్రాంతికిఁ జోటు బండయైనన్ మాటిమాటికిఁ గలలో సూటిగా నినుఁదలఁతు ||ఓ దేవ||

2వ చరణం

ఆకాశ మండల మార్గంబు నెప్పుడు నా కీవు చూపించుమా నీ కూర్మిచే నాకుఁ జేకూరు నంతయు లోకేశ్వర దూత లే కోరి ననుఁ బిలువ ||ఓ దేవ||

3వ చరణం

నీకు స్తోత్రము చేసి యపుడు నా మదిలోని ప్రాకటంబగు నెనరుతో భీకరము లైన శోకంబు లను రాళ్లన్ నీకు నాలయంబు నేఁగట్టె దను గర్తా ||ఓ దేవ||

4వ చరణం

సంతసంపు రెక్క లెత్తి నాకమునందు నెంత పైకి లేచినన్ వింతగ జ్యోతుల వితతి మించి నేన త్యంత మెగసినను నీ చెంత కేగును బాట ||ఓ దేవ||

Report Error