TG-2118
Telugu

ఓ మానవా.. నిజమేదో ఎరుగవా

oo maanavaa.. nijameedoo erugavaa

65
views
పల్లవి

ఓ మానవా.. నిజమేదో ఎరుగవా ఓ మానవా.. ఇకనైనా మారవా మన పాపములను క్షమియించుటకే సిలువ మరణము పొందెనని (2) గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు ఈ దినమే అనుకూలం… లేదిక వేరే ఏ సమయం నిజమేదో తెలియకనే చనిపోతే నీ గతి ఏమి? (2) ||ఓ||

1వ చరణం

సిలువను గూర్చిన శుభ వార్త వెర్రితనముగా ఉన్నదా? దేవుని శక్తని తెలుసుకొని ప్రభు మార్గమును చేరెదవా (2) ||ఈ||

2వ చరణం

ప్రయాసముతో భారము మోసే నిన్నే దేవుడు పిలిచెనుగా ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద వేగిరమే పరుగిడి రావా (2) ||ఈ||

3వ చరణం

నీ ధనము నీ ఘనము నీ సర్వస్వము చితి వరకే అర్పించుము నీ హృదయమును (నిజ) రక్షకుడైన ప్రభు కొరకే