ఓ నాదు యేసు రాజా
oo naadu yeesu raajaa
🎵 TG-1850🌐 Telugu
పల్లవి
ఓ నాదు యేసు రాజా నిన్ను నే నుతించెదను (2) నీ నామమును సదా నే సన్నుతించుచుండును (2) ||ఓ నాదు||
1వ చరణం
అనుదినము నిను స్తుతియించెదను (2) ఘనంబు చేయుచుండును నేను (2) ||ఓ నాదు||
2వ చరణం
వర్ణించెద నే నీ క్రియలను (2) స్మరియించెద నీ మంచితనంబున్ (2) ||ఓ నాదు||
3వ చరణం
రక్షణ గీతము నే పాడెదను (2) నిశ్చయ జయధ్వని నే చేసెదను (2) ||ఓ నాదు||
4వ చరణం
విజయ గీతము వినిపించెదను (2) భజియించెద జీవితమంతయును (2) ||ఓ నాదు||
5వ చరణం
నిరీక్షణ పూర్ణత కలిగి (2) పరికించెద నా ప్రభు రాకడను (2) ||ఓ నాదు||