ఓ సద్భక్తులారా ! లోకరక్షకుండు
oo sadbhakthulaaraa ! lookarakssakundu
ఓ సద్భక్తులారా ! లోకరక్షకుండు బెత్లెహేమందు నేఁడు జన్మించెన్ రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింప రండి నమస్కరింప రండి. నమస్కరింప రండి యుత్సాహముతో.
సర్వేశ్వరుండు నరరూప మెత్తి కన్యకుఁ బుట్టి నేఁడు వేంచేసెన్ మానవ జన్మ మెత్తిన శ్రీ యేసూ నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము. ||ఓ సద్భక్తులారా||
ఓ దూతలారా! ఉత్సహించి పాడి రక్షకుండైన యేసున్ నుతించుఁడి పరాత్పరుండా నీకు స్తోత్ర మంచు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో ||ఓ సద్భక్తులారా||
యేసూ! ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నర్పింతుము అనాది వాక్య మాయె నరరూపు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో ||ఓ సద్భక్తులారా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.