ఓడ్డుచేరి నీ యెదుట నిల్పునపుడు

oodducheeri nee yeduta nilpunapudu

🎵 TG-471💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఓడ్డుచేరి నీ యెదుట నిల్పునపుడు రక్షకా ఒక్క యాత్మనైన తేక సిగ్గుపడిపోదునా. ||ఓడ్డుచేరి నీ||

1వ చరణం

ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలమున్ వ్యర్థపరచు వారానాడు చింతతోడ నిల్తురు. ||ఓడ్డుచేరి నీ||

2వ చరణం

యేసువా! నా స్వరక్షణ నిశ్చయంబు యైనదే ఐనఫలితంబుజూడ కష్టపడనైతినే. ||ఓడ్డుచేరి నీ||

3వ చరణం

కాలమెల్ల గడ్చిపోయెన్ మోసపోతినేనయ్యో గడ్చినట్టి కాలమైతే ఏడ్చినను రాదది. ||ఓడ్డుచేరి నీ||

4వ చరణం

భక్తులారా! ధైర్యంతోడ లేచి ప్రకాశించుడీ ఆత్మలెల్ల యేసుయొద్ద చేరునట్లు చేయుడి. ||ఓడ్డుచేరి నీ||

Report Error