♪♫
TG-4690
Telugu
ఊహకందని ఉపకారములు కృప వెంబడి కృపలు
Oohakandani Upakaaramulu Krupa Venbadi Krupalu
24
views
పల్లవి
ఊహకందని ఉపకారములు కృప వెంబడి కృపలు మరువలేని నీదు మేలులు, వర్ణించలేని వాత్సల్యములు యేసయ్యా నీవే ఆధారమయ్యా నా మంచి కాపరి నీవేనయ్యా నూనెతో నా తలనంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును ||యేసయ్యా||
1వ చరణం
పచ్చిక చోట్లలో పరుండచేయును, శాంతికర జలములకు నడుపును నా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నడిపించును ||యేసయ్యా||
2వ చరణం
గాఢాంధకారములో నడిచిననూ, నాకు తోడుగా నీవుందువు ఏ తెగులును నా దరి రానీయక ప్రతీ కీడు నుండి తప్పించును ||యేసయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.