TG-3442
Telugu

ఊహకుమించిన కార్యములు

oohakuminchina kaaryamulu

Sandeepపాస్టర్. అక్షయ్ · Pastor. Akshayలిల్లియన్ క్రిస్టోఫర్ · Lillian Christopher
0
views
పల్లవి

ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్య (2) వివరించలేను నీ కార్యములు వర్ణించలేను నీ బలశౌర్యములు (2) ప్రియుడా మహాఘనుడా నీ ఘన కార్యములు కీర్తించనా (2)

1వ చరణం

కీర్తించనా కొనియాడనా అతి భీకరమైన నీ కార్యముల్ (2) సృష్టికర్తవు నీవు పరిపాలకుడవు (2) జీవపు వాక్కుచేత స్వరము సృజియిoచావే నిరాకార శూన్యమును తొలగించి వెలుగిచ్చావు నను మాత్రం నీకోసమే నీ పోలికలోనే నిర్మించినావు యేసయ్య (2) ||ఊహకు||

2వ చరణం

స్తుతించన ఘనపరచనా అత్యున్నతమైన నీ కార్యములు (2) రాజుల రాజు నీవు సార్వభౌమాధికారివి (2) నీ బాహుబలము చేత విడిపించి నడిపించావు రాజులను రాజ్యములను శాసించి ఓడించావు నను మాత్రం నీకోసమే విజయోత్సవముతో నడిపించినావు యేసయ్య (2) ||ఊహకు||

3వ చరణం

ప్రణుతించనా ప్రకటించనా అతి వైభవమగు నీ గుణముల్ (2) పరిశుద్ధుడ నీవు పరిపూర్ణడవు (2) నీ సిలువ త్యాగముచేత నన్ను రక్షించినావే నీ ప్రేమ రాజ్యంలోకి నను చేర్చుకున్నావు నే వేచియుండెద నీ కొరకే నాప్రాణ ప్రియుడా సిద్ధపడెద నీ రాకకై (2) ||ఊహకు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.