♪♫
TG-4694
Telugu
ఊహలకందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది
Oohalakandanidi Nee Thyaagan Varninpajaalanidi
0
views
పల్లవి
ఊహలకందనిది నీ త్యాగం - వర్ణింపజాలనిది ఊసులకందనిది నీ యాగం - వివరింపజాలనిది నీ కొరకే ఆ త్యాగం - మన కొరకే బలియాగం ఎంత ప్రేమయ్యా యేసు - వింత ప్రేమయ్యా (2) ||ఊహల||
1వ చరణం
ఎవరూ చూపని నీ ప్రేమ - నాకై చూపిన నా ఎవరూ చేయని ఆ త్యాగం - నాకై చేసిన నా ప్రభువా ఏమని వర్ణింతును - ఏమని వివరింతును నీ గొప్ప త్యాగాన్ని యేసు - ఆ గొప్ప యాగాన్ని (2) ||ఊహల||
2వ చరణం
నాలో మంచి లేదనియు - తెలిసి తనయునిగా పిలచి ఎంచలేని మంచిని - నాలో పెంచాలని యెంచి యాగమై బలియాగమై - త్యాగమై ప్రాణ త్యాగమై నాకై మరణించినా యేసు - నన్ను బ్రతికించినా (2) ||ఊహల||
3వ చరణం
Album : Ninne nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా)