TG-4695
Telugu

ఊహలు నాదు ఊటలు నా యేసురాజా

Oohalu Naadu Ootalu Naa Yeesuraajaa

0
views
పల్లవి

ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే యున్నవి (2) ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2) ||ఊహలు||

1వ చరణం

నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా (2) నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు (2) ||ఊహలు||

2వ చరణం

శత్రువులు పూడ్చిన ఊటలన్నియు త్రవ్వగా (2) జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు (2) ||ఊహలు||

3వ చరణం

ఊరు మంచిదే గాని ఊటలన్నియు చెడిపోయెనే (2) ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నొందెనే (2) ||ఊహలు||