♪♫
TG-4699
Telugu
ఊహించలేను ప్రభూ నీ మమతను
Oohinchaleenu Prabhoo Nee Mamathanu
23
views
పల్లవి
ఊహించలేను ప్రభూ నీ మమతను వివరించలేను యేసు నీ ప్రేమను నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా 1. ఈ లోక గాయాలతో నిను చూడగా లోతైన నీ ప్రేమతో కాపాడగా కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు అలుపంటు రాదే సదా నీ కనులకు ప్రతీ దినం ప్రతీ క్షణం నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ 2. నాలోని ఆవేదనే నిను చేరగా నా దేవ నీ వాక్యమే ఓదార్చగా ఘనమైన నీ నామమే కొనియాడనా విలువైన నీ ప్రేమనే నే పాడనా ఇదే వరం నిరంతరం నీతోనే సాగిపోనా – నా యేసయ్య
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.