TG-4050
Telugu

ఊహించలేనయ్యా

Oohinchalenayyaa

0
views
పల్లవి

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను (2) నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2) తరియించు వరమే దొరికెను (2) ||ఊహించ||

1వ చరణం

నా మనసు వేదనలో – నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను (2) అనాథయిన నను వెదకెను ప్రధానులలో ఉంచెను (2) ||ఊహించ||

2వ చరణం

నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో నా హృదయమే కరిగెను (2) ఇది నీ ప్రేమకే సాధ్యము వివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ||