TG-4052
Telugu

ఊహించలేని మేలులతో నింపిన

Oohinchaleni Melulatho Nimpina

19
views
పల్లవి

ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని||

1వ చరణం

మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని||

2వ చరణం

నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు (2) నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.