ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
ooranna ooranna yeesuku saativeeree leeranna leeranna
🎵 TG-1041🌐 Telugu
పల్లవి
ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న యేసే ఆ దైవం చూడన్నా- చూడన్నా (2)
1వ చరణం
చరిత్రలోనికి వచ్చాడన్నా - పవిత్ర జీవం తెచ్చాడన్నా (2) అద్వితీయుడు ఆదిదేవుడు - ఆదరించెను ఆదుకొనును (2) ||ఓరన్న ఓరన్న||
2వ చరణం
పరమును విడచి వచ్చాడన్నా - నరులలో నరుడై పుట్టాడన్నా (2) పరిశుద్దుడు పావనుడు - ప్రేమించెను ప్రాణమిచ్చెను (2) ||ఓరన్న ఓరన్న||
3వ చరణం
శిలువలో ప్రాణం పెట్టా డ న్నా-మరణం గెలిచి లేచాడన్న (2) మహిమ ప్రభూ మృత్యంజయుడు-క్షమియించును జయమిచ్చును(2) ||ఓరన్న ఓరన్న||