♪♫
TG-4054
Telugu
ఓరన్న ఓరన్
Oranna Oranna
0
views
పల్లవి
ఓరన్న… ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా ||ఓరన్న||
1వ చరణం
చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2) అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును (2) ||ఓరన్న||
2వ చరణం
పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా (2) పరిశుద్దుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను (2) ||ఓరన్న||
3వ చరణం
సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న (2) మహిమ ప్రభూ మృత్యుంజయుడు క్షమియించును జయమిచ్చును (2) ||ఓరన్న||