TG-672
Telugu

పాడెద దేవ నీ కృపలన్

paadeda deeva nee krupalan

200
views
పల్లవి

పాడెద దేవ నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్(2) ఆ..ఆ..ఆ...(2)

1వ చరణం

భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి ప్రేమ పునాదులు వేసితివి బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి ||పాడెద దేవ||

2వ చరణం

ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి ప్రేమకృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి ||పాడెద దేవ||

3వ చరణం

పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను థర బ్రతికించితివి నన్ను బ్రతికించితివి ||పాడెద దేవ||

4వ చరణం

దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి చెరవిడిపించితివి ||పాడెద దేవ||

5వ చరణం

ముద్రించితివి శుద్ధాత్మతో నను భద్రము చేసితివి సత్యస్వరూపి నిత్యనివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి ||పాడెద దేవ||

6వ చరణం

అన్యుడనై నిన్ను ఎరుగక యున్నను ధన్యుని చేసితివి ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి కృప వరముల నొసగితివి ||పాడెద దేవ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.