TG-1132
Telugu

పాడెద నేనొక నూతన గీతం - పాడెద మనసారా

paadeda neenoka nuuthana geetham - paadeda manasaaraa

188
views
పల్లవి

పాడెద నేనొక నూతన గీతం - పాడెద మనసారా యేసయ్యా నీ నామమేగాగ వేరొక నామము లేదాయే (2)

1వ చరణం

కలుషితమైన నదియై నేను - కడలియైన నీలో (2) కలిసిపోతినే కలువరి ధారిలో కనబడదే ఇక పాపాలరాశి (2) ||పాడెద నేనొక||

2వ చరణం

పోరు తరగని సిగ సెగలన్నియు - అణచి కృపాతిశయము (2) కొదువైన నానా హృదయములోన పొంగెనే అభిషేకతైలం (2) ||పాడెద నేనొక||