TG-403
Telugu

పాడుదును క్రీస్తు పేర పదము

paadudunu kreesthu peera padamu

203
views
పల్లవి

పాడుదును క్రీస్తు పేర పదము నెంతో వేడుదు నా దివ్యాగురు నివ్విధముఁ జూడఁజూడ మదిలో నెంతో వేడుకగా మీఱె వింత ఱేడుఁ బోలినవా డిహ లేఁడు లేఁడందు నహహా ||పాడుదును క్రీస్తు||

1వ చరణం

పెక్కు పాపములలోన మణఁగి నాదు తక్కువ బుద్ధిచే నందణఁగి దిక్కు గానక నుండు వేళ దిక్కయి చనుదెంచి మరల గ్రక్కున కరముఁ జూచి చక్కికిఁ జేర్చి ప్రోచె ||పాడుదును క్రీస్తు||

2వ చరణం

మోసపు లోక వాంఛలను వట్టి యాశలతోఁ గూడికొన్న కలలు రోసితిఁ గాన వాని యేసుతోఁ గూడుకొంటి వీసమైనను లేమి లేశము లేదనుస్వామి ||పాడుదును క్రీస్తు||

3వ చరణం

పాయ నెన్నటికిని వాసిగాఁ బాస త్రోయను త్రోయను యని చేసెగా రోయక న న్నావిభుఁడు సాయమై రక్షించు నెపుడు నా యనీతి భయములు మాని యాయనే జయంజయమని ||పాడుదును క్రీస్తు||

4వ చరణం

చాలు చాలు పాపమా నీ చెలిమి నిత్య కాలము గలిగించు మృత్యుకలిమి యేలికైన నాయిమ్మాను యేలు నాయందు దయను మేలిమి నగుపరచినట్టి జాలినేఁ గంటిఁ గాన ||పాడుదును క్రీస్తు||

5వ చరణం

ధరలో దేనికి భయపడను ఎట్టి తరుణమైనను చేయి విడను కరుణామయుండు నన్ను కరుణ నేర్పరచి మున్ను మరణమందును వాని శరణం నాశరణమని ||పాడుదును క్రీస్తు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.