♪♫
206
views
పల్లవి
పాపల్ హోసన్నా పాటల్ పాడిన రీతిగన్ నృపాలస్తుతి కీర్తుల్ నీకుఁ జెల్లింతుము దావీదు పుత్రకుండా యిశ్రాయేల్ పాలకా దేవుని పేర వచ్చు ధీరుండా ధన్యాత్మ.
1వ చరణం
దూత లాకాశమందు దొడ్డగఁ గొల్తురు భూతలమందు సృష్టి పూజించును నిన్ను హెబ్రీయుల్ ఖర్జూరంపు శాఖల్ చేఁబూనుచు హెచ్చించి మొక్కినట్లు నిను స్తోత్రింతుము. ||పాపల్ హోసన్నా||
2వ చరణం
నీ శ్రమలకు ముందు, నిన్ గౌరవించిరి నీ జయమొందువెన్న మా కీర్తన స్తుతి అవ్వారి స్తుతుల్ నీవు అంగీకరించితి మా కీర్తంబుగూడ మన్నన జేయుమీ. ||పాపల్ హోసన్నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.