TG-4060
Telugu

పాపమెరుగని పావనాత్ముని

Paapamerugani Paavanaathmuni

22
views
పల్లవి

పాపమెరుగని పావనాత్ముని పరిహసించుట న్యాయమా (2) దోషమెరుగని దీన బాంధుని (2) దోషి చేయుట ధర్మమా – ధర్మమా ||పాపమెరుగని||

1వ చరణం

మోయరాని పాప భారము మోపినారు సిలువపై (2) గాయమొంది బాధకోర్చి వేదననొంది ప్రాణమిచ్చుట నేరమా (2) నేరమా ||పాపమెరుగని||

2వ చరణం

జీవ జలముల త్రోవ చూపి బ్రోవ నాత్మల దాహమొందె (2) చావొంది ఆగమై బలి దానమై జీవమిచ్చుట ఘోరమా (2) ఘోరమా ||పాపమెరుగని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.