పాపము దలఁచు సుమీ పశ్చా

paapamu dalamchu sumee pashchaa

🎵 TG-317💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పాపము దలఁచు సుమీ పశ్చా త్తాపముఁ బొందు సుమీ దాపని యేసుని పాదంబులబడి పాపము వీడు సుమీ ||పాపము దలఁచు||

1వ చరణం

పాపము చేయకు మీ యేసుని గాయము రేపకుమీ పాయక పాపము చేసిన మనసా కాయఁడు యేసు సుమీ ||పాపము దలఁచు||

2వ చరణం

గంతులు వేయకుమీ యేసుని చెంతకుఁ జేరు సుమీ వింతఁగఁ గ్రీస్తుని రక్షణ్యామృత బిందువుఁ గోరు సుమీ ||పాపము దలఁచు||

3వ చరణం

ఈ ధరన్నమ్మకుమీ ఆత్మకు శోధన లుండు సుమీ శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగ నుఁడు సుమీ ||పాపము దలఁచు||

4వ చరణం

తెగువఁ బోరాడు సుమీ రిపునకు బెగ్గిలవద్దు సుమీ తెగువగు ప్రార్థన ఖడ్గమునుఁ బట్టి పగతునిఁ గెల్వు సుమీ ||పాపము దలఁచు||

5వ చరణం

అంతము వచ్చు సుమీ రక్షణ అంతలో వెదకు సుమీ అంత రంగుఁ డగు క్రీస్తు రక్షకుని చెంతను జేరు సుమీ ||పాపము దలఁచు||

Report Error