పాపము వలనఁ చెడినవానిఁ ప్రేమతో
paapamu valanam chedinavaanim preemathoo
పల్లవి
పాపము వలనఁ చెడినవానిఁ ప్రేమతో వెతకి రక్షించుఁడు తప్పినవానిని ద్రోహిని మీరు యేసుని యొద్దకు రమ్మనుఁడు. ||పాపము వలనఁ||
1వ చరణం
నీతిని కోరక యల్లాడువాని యేసు రక్షించుటకై కాచును ప్రేమతో వారినిఁ బిలుచుకొండి యేసును నమ్మిన రక్షించును. ||పాపము వలనఁ||
2వ చరణం
పాపవిషంబు మనస్సున దాగి గుణము పూర్తిగఁ జెఱిపినన్ యేసుని ప్రేమ యనుకిరణంబు దాని గుదుర్చును పూర్ణముగా. ||పాపము వలనఁ||
3వ చరణం
చెడినవారిని రక్షింపఁ బొండి యేసుఁడు శక్తిని మీ కీయఁగా మోక్ష మార్గంబునడిపించుండి వారిని రక్షింప యేసు వచ్చెన్ ||పాపము వలనఁ||