పాపులకు సఖుండు మన ప్రాపు

paapulaku sakhundu mana praapu

🎵 TG-293💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పాపులకు సఖుండు మన ప్రాపు యేసె సుమండి భువి పాపులకు సఖుండు ||పాపులకు సఖుండు||

1వ చరణం

రండి రండి మిత్రులార నిండు ధైర్య పడండి వేగమె దండైన యండ మన కుండు యేసుండని ||పాపులకు సఖుండు||

2వ చరణం

దాహ మణంచు దేవ వాక్యము దేహధారులార రండి దేహీ యన విహీనుల సాహాయ్యము నోహో యని ||పాపులకు సఖుండు||

3వ చరణం

ద్రవ్య మించుక లేని విక్రయ మయ్య యీ యేసయ్య రక్తము చేయలే మయ్య మన మయ్య దుర్నయ్యముల్ ||పాపులకు సఖుండు||

4వ చరణం

నిండు మనసు గలిగియే సండఁజేర రండి వేగమె నిండు ప్రియుండు న ఖండ పురుషుండని ||పాపులకు సఖుండు||

5వ చరణం

నింద లన్ని పొంది ప్రభుని మందలో వెలుఁగొందరే తఱిఁ పొం దుగ నిందలో నుందు రానందమున ||పాపులకు సఖుండు||

Report Error