పాపులమైన మా కొరకు పావనుడా యేసయ్య బలియయితివా
paapulamaina maa koraku paavanudaa yeesayya baliyayitivaa
పాపులమైన మా కొరకు పావనుడా యేసయ్య బలియయితివా దోషులమైన మా కొరకు దోషములేని నీవు మరణించితివా (2) ప్రేమ చూపే గొప్ప మనసు నీది మోసగించే మనుషులము మేము ప్రాణమిచ్చే త్యాగశీలివి నీవు మర్చిపోయే మూర్ఖులము మేము మన్నించుమయ్య మా పాపములన్ మహనీయమైన నిన్ను సిలువ వేసినందుకు క్షమించుమయ్య మా దోషములన్ శిరముపై ముళ్లను గ్రుచ్చినందుకు ||పాపులమైన ||
లోకమంతా పాపివంటూ సిలువను భుజముపై మోపితిమే పాపమంటూ ఎరుగని నిన్ను దోషివంటూ చిత్రీకరించితిమే (2) ఎందుకంతా ప్రేమ మాపై ప్రాణమును మా కొరకై అర్పించుటకై ఎందుకంతా జాలి మాపై సిలువలో మా కొరకై బలి అవుటకు మన్నించుమయ్య మా పాపములన్ మహనీయమైన నిన్ను సిలువ వేసినందుకు క్షమించుమయ్య మా దోషములన్ శిరముపై ముళ్లను గ్రుచ్చినందుకు ||పాపులమైన ||
దాహమనగా నీదు ప్రాణం చేదైన చిరకను నీకిచ్చితిమే స్వర్ణ కిరీటముండే నీ తలపై ముళ్ల కిరీటము ధరింపజేసితిమే (2) ఎందుకంతా ప్రేమ నాపై శోకమంతా భరించుటకు ప్రాణమిచ్చి మమ్మును రక్షించుటకై గోరపాపినైనా నన్ను క్షమించుటకు మన్నించుమయ్య మా దోషములన్ మహనీయమైన నిన్ను సిలువ వేసినందుకు క్షమించుమయ్య మా దోషములన్ శిరముపై ముళ్లను గ్రుచ్చినందుకు ||పాపులమైన ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
