పగిలిన పాత్రనైయ్య- నా కుమ్మరి
pagilina paatranaiyya- naa kummari
పగిలిన పాత్రనైయ్య- నా కుమ్మరి సరిచేయ వల్లపడదే- ధర యెవ్వరికి (2)
నా నిర్మాణకుడా - నిర్మిచినావే నీ చేతితోనే - నీ మహిమాకై దయ చూపుమైయ్య- నన్ను తాకుమయ్య సరిచేయుమయ్య - నా తండ్రివై (2) ||పగిలిన పాత్రనయా||
ఓ మంటి పాత్రను - బ్రద్దలైన బ్రతుకును బాగుచెయ్య సక్యముఖాని -బలహీనుడన్ పారవేయబడుటకే , నిర్ణయింపడినప్పుడు ప్రేమాచూపి నన్ను నీవు - చేరదీసినవయ్య(2) నీవు చేయలేనిది - ఏదీలేదు యేసయ్య ||నా నిర్మాణకుడా||
మనసుకు గాయమై - కుమిలిపోతుండగా ఓదార్చువరులేక నేనెడుచుండగ జాలిచూపువారికోరకు - దిక్కులన్నివేతికనే గాయమును కట్టు నరుడు - ఎ దిక్కు కనరాడే (2) నా దిక్కు నీవయ - పరమవైద్యుడా ||నా నిర్మాణకుడా||
యోగ్యుడను కానయ - ఎ మంచి లేదయ్య నీ పాత్రగానుండా - పాత్రుడను కాదయా ఓ మంచి కుమ్మరి -నా ప్రాణ స్నేహమా బలహీనతలన్నీ ఎరిగి - నన్ను కోరుకున్నావా (2) నీ పాద సేవయే - నా భాగ్యమా (2) ||నా నిర్మాణకుడా||
