TG-5397
Telugu

పంపుము దేవా దీవెనలతోఁ పంపుము దేవా

Panpumu Deevaa Deevenalathoon Panpumu Deevaa

20
views
పల్లవి

పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2) పంపుము దయ చేత పతిత పావన నామ పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప ||పంపుము||

1వ చరణం

మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు (2) యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు ||పంపుము||

2వ చరణం

వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి (2) దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప ||పంపుము||

3వ చరణం

ఆసక్తితో నిన్ననిశము సేవింప (2) భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి ||పంపుము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.