♪♫
TG-5398
Telugu
పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు
Panpumu Deevaa Panivaaralanu Pantanu Kooyutaku
0
views
పల్లవి
పంపుము దేవా పనివారలను – పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమ పడుచుండగా చింతయే లేని క్రైస్తవులందరిన్ ||పంపుము||
1వ చరణం
1. నాగలి మీద చేయినివేసి వెనుకకు చూడక సాగెడి వారిని భారము గలిగి సువార్త గింజలు దున్నిన యెడల చల్లెడివారిని (2) ||పంపుము||
2వ చరణం
2. తెల్లవారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగ ఉల్లాసముతో కూర్చెడి వారిని (2) ||పంపుము||
3వ చరణం
3. పరమండలము సంతసమొందగ ధరణిలో ఆత్మల సంపద పండగ చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని (2) ||పంపుము||