పరాక్రమవంతుడు నా పక్షమునున్నాడు విజయము నాదేగా
Paraakramavanthudu Naa Pakshamununnaadu Vijayamu Naadeegaa
పరాక్రమవంతుడు నా పక్షమునున్నాడు విజయము నాదేగా సైన్యములకు అధిపతి తన సొత్తని అన్నాడు సంతసించి పాడేదను క్రొత్త కీర్తనతో - స్తుతి గానముతో నిన్ను కొనియాడేదను నా శక్తి చేతను - నా బలము చేతను నిన్ను ఆరాధించేదను జయము జయము జయము జయము ఏసు రక్తమే జయము జయము ఏసు నామమే (2) ||పరాక్రమ||
నాకై దిగి వచ్చి - నాకై మరణించి తిరిగి లేచిన విజయ వీరుడు సతాను గుంపులను - దురాత్మ శక్తులను అణచి వేసిన అత్యున్నతుడు (2) అన్ని నామములకన్న పై నామము నా యేసు నామము అతి సుందరమైన ఆశ్రయ దుర్గము నా యేసుని నిలయము (2) ||జయము||
నా ఎదుట సంద్రమున్న - యేరికో గోడలున్న చీల్చి కూల్చువాడు మహిమొన్నతుడు తన మార్గము చూపి - అడ్డును తొలగించి నడిపించాడు అభిషిక్తుడు (2) ఎన్ని శోధనలున్నా వేదనలున్న నమ్మదగిన వాడు తన చిత్తము నెరవేర్చి చిత్రము చూపెను నా ఏసు రాజు (2) ||జయము||