పరాలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం
paraalookamee naa anthapuram cheeraalanee naa thaapathrayam
🎵 TG-1128🌐 Telugu
పల్లవి
పరాలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం యేసుదేవరా..కనికరించవా... దారి చూపవా...... (2) ||పరలోకమే||
1వ చరణం
స్వల్ప కాలమే ఈలోక జీవితం - నాభవ్య జీవితం మహోజ్వలం మజిలీలు దాటే మనో బలం - నీ మహిమ చూసే మధుర క్షణం (2) వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం నాకు నేర్పవా... (2) ||పరలోకమే||
2వ చరణం
పాపము నెదిరించే శక్తిని నాకివ్వు - పరులను ప్రేమించే మనసే నాకివ్వు ఉద్రేక పరచే ధురాత్మను - ఎదురించి పోరాడే శుధాత్మను (2) మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం నాకు నేర్పవా... (2) ||పరలోకమే||