పరదేశులమో ప్రియులారా మన పురమిది గాదెపుడు
Paradeeshulamoo Priyulaaraa Mana Puramidi Gaadepudu
పరదేశులమో ప్రియులారా మన పురమిది గాదెపుడు (నిజముగ) (2) ||పరదేశుల||
చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి చిత్రమైన సంత (లోకము) (2) ||పరదేశుల||
సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణగన్ (నిజముగ) (2) ||పరదేశుల||
స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమే స్థిరము (నిజముగ) (2) ||పరదేశుల||
మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడై కనబడవే (నిజముగ) (2) ||పరదేశుల||
ధర ధాన్యంబులు దరగక మానవు పని పాటలు పోయె (నిజముగ) (2) ||పరదేశుల||
ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నై పోవునుగా (దేహము) (2) ||పరదేశుల||
వచ్చితి మిచటికి వట్టి హస్తముల దెచ్చిన దేదియు లే (దు గదా) (2) ||పరదేశుల||
ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు అట్లు వెళ్ళవలయున్ (మింటికి) (2) ||పరదేశుల||
యేసు నందు విశ్వాసం బుంచిన వాసిగ నిను జేర్చున్ (బరమున) (2) ||పరదేశుల||
యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా (నిజముగ) (2) ||పరదేశుల||