TG-5447
Telugu

పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం

Paralookamee Naa Anthahpuran Cheeraalanee Naa Thaapathrayan

0
views
పల్లవి

పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం (2) యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2) ||పరలోకమే||

1వ చరణం

స్వల్ప కాలమే ఈ లోక జీవితం నా భవ్య జీవితం మహోజ్వలం (2) మజిలీలు దాటే మనోబలం నీ మహిమ చూసే మధుర క్షణం (2) వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా (2) ||పరలోకమే||

2వ చరణం

పాపము నెదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు (2) ఉద్రేక పరచే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2) మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం – నాకు నేర్పవా (2) ||పరలోకమే||