♪♫
TG-2733
Telugu
పరమ జీవము నాకు నివ్వ
parama jeevamu naaku nivva
82
views
పల్లవి
పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును – యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు||
1వ చరణం
పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.